పాక్ నుంచి ముప్పు పొంచి ఉంది

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ అధికరణ 370 రద్దు తర్వాత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీను నిర్భంధించిన సంగతి తెలిసిందే.

Update: 2019-10-16 13:13 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిచే అధికరణ 370 రద్దు తర్వాత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీను నిర్భంధించిన సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. ముగ్గురు మాజీ సీఎంల విడుదల తన చేతిలో లేదని స్పష్టం చేశారు. కశ్మీర్ లో పూర్తిగా సాధారాణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పాక్ నుంచి ముంప్పు పొంచి ఉందని భద్రతా దళాలు, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆర్టికల్ 370 బిల్లును అడ్డుపెట్టుకొని పాక్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిందని, ఆర్టికల్ 370 రద్దు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News