సీఎంకు లేఖ రాసిన చిన్నారి..

Update: 2019-12-15 11:15 GMT

తన తండ్రికి తక్కువ జీతం ఉండడంతో తనతో ఎక్కువ సమయం గడపడం లేదని తన తండ్రికి జీతం పెంచాలంటూ ఓ చిన్నారి ముఖ్యమంత్రికి లేఖ రాసింది. పూర్తి వివరాల్లోకెళితే మహారాష్ట్రలోని జల్నా ప్రాంతంలో నివాసం ఉంటున్న సచిన్ హరాలే ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి తక్కువ జీతం రావడంతో డబ్బుల కోసం అదనంగా విధులను నిర్వహిస్తున్నాడు. తనకు ఒకటో తరగతి చదిలే శ్రీయా హరాలే అనే కూతురు ఉంది. ఆ చిన్నారి ఉదయం నిద్ర లేవకముందే విధులకు వెళ్లే సచిన్, మళ్లి ఆ చిన్నారి పడుకున్నాక ఇంటికి వస్తాడు. దీంతో ఆ చిన్నారి తన తండ్రి ప్రేమకు నోచుకోలేకపోతుంది. ఎందుకింత ఆలస్యంగా వస్తున్నారు అని చిన్నారి తన తండ్రిని అడగడంతో తండ్రి ఆమెకి సమాధానం చెప్పాడు. ఆ మాటలు ఆమె బుర్రలో బలంగా నాటుకుపోవడంతో తన తండ్రికి జీతం పెంచాలని ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాసింది.

సర్‌.. మా నాన్న నాతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో నేను సరిగ్గా చదవలేకపోతున్నా. మీరు నాన్న జీతం పెంచితే నాతో ఎక్కువ సమయం గడపడానికి, స్కూల్‌కు తీసుకెళ్లడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. తక్కువ జీతం రావడంతోనే మా నాన్న అదనంగా పనిచేయాల్సి వస్తుంది. మా నాన్నతో నేను ఎక్కువ సమయం గడపాలి' ఆయనతో ఆడుకోవాలి అంటూ మరాఠీలో లేఖను రాసింది. ఆ లేఖను పోస్ట్ చేయమని తండ్రి చేతికి అందించింది. అయితే లేఖను అందుకున్న తండ్రి సచిన్ మాట్లాడుతూ నా జీతం గురించి సీఎంకు మా అమ్మాయి లేఖ రాసి.. పోస్ట్‌ చేయమని నాకు ఇచ్చిందని అన్నారు. దీనిని తాను ఆర్డినరీ పోస్ట్‌ ద్వారా పంపానని, ముఖ్యమంత్రికి చేరిందో లేదో నాకు తెలియదని అన్నారు.







Tags:    

Similar News