ఇండియాలో నెట్ సేవలు బంద్ ..లక్షల కోట్ల నష్టం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు విధించారు.

Update: 2019-12-28 14:59 GMT
internet shutdown File Photo

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు విధించారు. అంతే కాకుండా రెచ్చగొట్టే సందేశాలు పంపుతారనే క్రమంలో ఆగస్టు నుంచి అంతర్జాల సేవలు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్నెట్‌ సేవలు రద్దు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో నెట్ సేవలు బంద్ చేసింది.

ఇదిలా ఉంటే ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేయడంతో టెలికామ్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అయితే ఇప్పటి వరకూ అంతర్జాల సేవలు రద్దు చేసిన రాష్ట్రాలు చూస్తే.. దేశంలో ఇప్పటి జమ్మూకశ్మీర్‌లో 2012లో ఒక్క కశ్మీర్‌లో మాత్రమే అంతర్జాల సేవలు నిలిపివేశారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపి వేసిన దేశాలు చూస్తే ఇరాక్, సిరియా దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. సిరియా అంతర్యుద్ధం కారణంతో అక్కడ సేవలు నిలిపి వేశారు. పాకిస్థాన్‌ మూడో దేశంగా నిలిస్తే, భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌లో ప్రజాందోళనలు చెలరేగినప్పుడల్లా ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేయడం అలవాటుగా మారింది. 2012 నుంచి 2019 వరకు ఏడేళ్ల 374 సార్లు ఇంటర్నెట్‌ సౌకర్యాలను రద్దు చేశారు. గురువారం నుంచి దేశంలోని 14 రాష్ట్రాల్లో వీటి సేవలను నిలిపివేశారు.

2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్‌ ఎమర్జెన్సీ ఆర్‌ పబ్లిక్‌ సేఫ్టీ చట్టం కింద తరచూ ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేస్తుంది. 2015, జూలై నెల నుంచి 2016, జూన్‌ మధ్య ఇంటర్నెట్‌ సేవలు రద్దు వలన 968 మిలియన్‌ డాలర్ల నష్టం ఏర్పడింది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో 3 బిలియన్‌ డాలర్లు, 2 లక్షల పదిహేను వేల కోట్ల దేశ టెలికామ్‌ కంపెనీలు కోల్పోయాయి అంచనా వేసింది. 2016లో ఐక్యరాజ్య సమతి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించడం ప్రాథమిక హక్కని పేర్కొంది.

  

Tags:    

Similar News