Tejas Express : గంట ఆలస్యానికి రూ.63వేల నష్టం

నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా పరిహారం చెల్లిస్తామని ప్రయాణికులతో ఐఆర్‌సీటీసీ గతంలోనే చాలెంజ్ చేసి ఓడిపోయింది.

Update: 2020-01-23 05:20 GMT
ప్రతీకాత్మక చిత్రం

టికెట్ కొనకుండా రైళ్లో ప్రయాణించే ప్రయాణికులకు ఫైన్ విధించడం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఐఆర్ సీటీసీ ప్రయాణికులకే తిరిగి పరిహారం చెల్లించడం రెండో సారి చూస్తున్నాం. మొదటి సారి అక్టోబర్‌ 19న ప్రయాణికులకు ఫైన్ చెల్లించిన తేజస్ రెండోసారి ఈ నెల 19వ తేదీ తరువాత చెల్లించింది. చూస్తుంటే తేజస్ రైలుకు 19వ తేదీ ప్రయాణం అచ్చొచ్చినట్టు లేదు కాబోలు.

ఇక పూర్తి వివరాల్లోకెళ్తే అన్ని సౌకర్యాలను ప్రయాణికులను అందుబాటులో ఉంచి, రైళ్లో ట్రైన్ హోస్టెస్ లను కూడా నియమించింది తేజాస్ ఎక్స్‌ప్రెస్. అయితే దేశంలో రెండో ప్రైవేటు రైలు అయిన తేజాస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సీటీసీ నడుపుతోంది. ఈ రైలు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా పరిహారం చెల్లిస్తామని ప్రయాణికులతో ఐఆర్‌సీటీసీ గతంలోనే చాలెంజ్ చేసి ఓడిపోయింది. ఇప్పుడు అలాంటి సంఘటనూ ముంబైలోనూ వెలుగుచూసింది.

ఈ నెల 19వతేదీన అహ్మదాబాద్- ముంబై తేజాస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ నుంచి ఉదయం 6.42 గంటలకు ముంబైకు బయలుదేరింది. మధ్యాహ్నం 1.10 గంటలకు రావాల్సిన రైలు మధ్యాహ్నం 2.36 గంటలకు చేరింది. ముంబై నగర శివార్లలోని భయందర్, దహిసర్ రైల్వేస్టేషన్ల మధ్య సాంకేతిక లోపం వల్ల దాదాపుగా ఆ రైలు ముంబై నగరానికి గంటన్నర సేపు ఆలస్యంగా చేరుకుంది. దీంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారులు ప్రయాణికులకు రూ.63వేలను నష్టపరిహారం కింద చెల్లించారు. అనంతరం ఐఆర్‌సీటీసీ అధికారులు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రయాణికులకు నష్టపరిహారాన్ని చెల్లించామని చెప్పారు.  




Tags:    

Similar News