మోడీ సర్కార్ పై టీడీపీ ఎంపీ ఫైర్

Update: 2020-02-11 02:26 GMT

సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు.. రాజకీయాలతో రాష్ట్రం అన్యాయమైపోతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇప్పటివరకు 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారని కానీ ఒక్కసారి కూడా రాష్ట్రానికి న్యాయం చేసిందని లేదని అయన అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్పుకోడానికి కూడా ఏమీ లేదని అన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, కానీ కేంద్రం మోడీ చేయి చూపిస్తుందని అన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏపీ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం :

ఏపీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. 2021లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం 3047 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1400 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆడిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది 

Tags:    

Similar News