కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడే ఎన్నిక

Update: 2019-08-10 02:04 GMT

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న వార్ రూమ్ లో భేటీ అయింది. నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేతను ఎన్నుకోనున్నారు. దానికోసం కసరత్తు జరిగినట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవికి రేసులో జ్యోతిరాదిత్య సింధియా పేరు బలంగా వినిపించినా తాజాగా ముకుల్ వాస్నిక్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంపై సమావేశం చర్చించింది. ఎన్డీఎ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రేపటినుంచి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీడబ్ల్యుసీ భేటీ తీర్మానించింది. సమావేశానికి రాహుల్,ప్రియాంక కూడా హాజరయ్యారు. 

Tags:    

Similar News