చిన్నమ్మ చివరి ట్వీట్..

Update: 2019-08-07 01:06 GMT

సుష్మాస్వరాజ్‌ అకాల మృతితో యావత్‌ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సుష్మా చివరి శ్వాస వరకూ దేశ అభివృద్ధి కోసం పాటు పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై మోడీని అభినందిస్తూ ట్విట్ చేశారు. గుండెపోటుతో కన్నుమూసిన సుష్మాస్వరాజ్‌ మరణానికి నాలుగు గంటల క్రితం చివరి ట్వీట్ చేశారు. లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్‌విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధాని నరేంద్రమోదీని అభినందించారు. జీవితంలో తాను ఈరోజు కోసమే ఎదురుచూశానని సుష్మా ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అంత ప్రజాధరణ కలిగి ఉన్న నాయకురాలు సుష్మా స్వరాజ్ సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సుష్మా.. చివరి శ్వాస వరకు దేశ అభివృద్ది కోసం పాటు పడ్డారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లు పాస్‌ కావడంతో ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రం ఆమె చివరి ట్వీట్‌ చేశారు. ఇందు కోసమే తాను చాలు రోజులుగా వేచి చూస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్‌ షా హుందాగా ప్రవర్తించారని మరొక ట్వీట్‌లో ప్రశంసించారు.


Tags:    

Similar News