పౌరసత్వ సవరణ చట్టంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టాన్నివ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేయవచ్చు- నిర్మలా సీతారామన్‌

Update: 2020-01-19 14:58 GMT
నిర్మాల సీతారామన్ ఫైల్ ఫోటో

CAAకు వ్యతిరేకంగా కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీర్మానాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్నివ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేయవచ్చని అయితే నూతన చట్టం అమలును అవి నిర్ణయించలేవని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. సీఏఏను అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. చెన్నై సిటిజన్స్‌ ఫోరం... సీఏఏపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయవచ్చని, దాన్ని రాజకీయ ప్రకటనగా తాము అర్ధం చేసుకోగలమని అన్నారు. వారు ఇంకా ముందుకెళ్లి ఆ చట్టాన్ని తాము అమలు చేయబోమని చెప్పడం సరైంది కాదని, అది చట్ట విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్ట అమలుకు పూనుకోవడం రాష్ట్రాల బాధ్యతని చెప్పారు. 

Tags:    

Similar News