Sankranti Gift: రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్: పండుగ పూట అకౌంట్లో రూ. 3,000 జమ..!
Sankranti Gift: పండుగ వచ్చిందంటే చాలు.. సామాన్యుడి కళ్లు ప్రభుత్వ ప్రకటనల వైపు మళ్లుతాయి.
Sankranti Gift: పండుగ వచ్చిందంటే చాలు.. సామాన్యుడి కళ్లు ప్రభుత్వ ప్రకటనల వైపు మళ్లుతాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ప్రకటించిన 'పొంగల్ గిఫ్ట్' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రంలో ఇస్తున్న భారీ నగదు సహాయంపై ఏపీ ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
తమిళనాడు ప్రభుత్వం 2026 పొంగల్ పండుగను పురస్కరించుకుని రేషన్ కార్డు ఉన్న సుమారు 2.22 కోట్ల కుటుంబాలకు రూ. 3,000 నగదు సహాయాన్ని ప్రకటించింది. దీనితో పాటు.. 1 కిలో బియ్యం, 1 కిలో చక్కెర, పూర్తి స్థాయి చెరుకుగడ, ధోతీ మరియు చీర కూడా పంపిణీ చేయనున్నారు. శ్రీలంక శరణార్థి శిబిరాల్లో నివసించే కుటుంబాలకు కూడా ఈ లబ్ధి చేకూర్చడం విశేషం. ఈ ఒక్క పథకం కోసం స్టాలిన్ సర్కార్ దాదాపు రూ. 6,936 కోట్లు ఖర్చు చేస్తోంది.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 'చంద్రన్న సంక్రాంతి కానుక' పేరుతో నెయ్యి, బెల్లం, శనగలు వంటి ఆరు రకాల వస్తువులతో కూడిన కిట్‌లను పంపిణీ చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అయితే, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, తమిళనాడు తరహాలో నగదు సహాయం అందితే తమకు మరింత వెసులుబాటుగా ఉంటుందని సామాన్యులు భావిస్తున్నారు.
వస్తువుల రూపంలో ఇచ్చే కానుకల కంటే, నేరుగా అకౌంట్లలోకి లేదా చేతికి నగదు అందితే పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. తమిళనాడులో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది అక్కడి పేద కుటుంబాల్లో విపరీతమైన ఆనందాన్ని నింపింది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఏదైనా 'సర్ప్రైజ్' ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.