భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Update: 2022-05-16 12:18 GMT

దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించి.. అండమాన్‌ను తాకాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ దీవులకు పూర్తిగా విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్‌ కంటే ఆరు రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అండమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలో నాలుగు, ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య, మధ్య వాయువ్య భారత్‌పై ఉష్ణగాలుల ప్రభావం క్రమంగా తగ్గుతాయని, మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విదర్భ నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగుతున్న ఉష్ణగాలుల తీవ్రత కొనసాగుతున్నట్లు వివరించారు.

Tags:    

Similar News