కశ్మీర్‌ పరిస్థితిపై లోక్‌సభలో అమిత్ షా ప్రకటన

Update: 2019-12-10 09:49 GMT
అమిత్ షా

కశ్మీర్‌లో పరిస్థితిపై నేడు లోకసభలో చర్చ జరిగింది. జమ్ముకాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. లోక్ సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ మాత్రం రక్తపాతం కోరుకుందని అందుకే వారికి ప్రశాంతంగా లేదని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370 తర్వాత హింస చెలరేగుతుందని కోరుకుందని కానీ ఇప్పటివరకు ఒక్క తూటా కూడా పేలలేదని ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని స్పష్టం చేశారు.

అక్కడ నిర్బంధంలో ఉన్న నేతలను ఏపుడు విడుదల చేయాలో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్ పరిస్థితిపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌కు, అమిత్ షా మధ్య సభలో మాటల యుద్ధం కొనసాగింది. అధిర్ రంజన్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని విమర్శించారు.

Tags:    

Similar News