ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు

Update: 2020-02-28 10:39 GMT
ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు

ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు చేపట్టింది. ఘటనలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమించారు. రేపు ప్రస్తుత పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలీసులు వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చేలా కవాతు నిర్వహించారు. అలాగే అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజలను ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఓపీ మిశ్రా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలపై వారిలో ఉన్న సందేహాలను తెలుసుకున్నారు. భయం వద్దంటూ.. భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News