ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సిద్ధం

Update: 2019-11-15 17:04 GMT
Ncp,Shivasena,congress

మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి. కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీలు అంగీకరించాయి. ప్రభుత్వ ఏర్పాటు, పదవుల పంపకాలపై ఒప్పందం కుదిరింది. సీఎం పీఠాన్ని ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అంగీకరించాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్, ఎన్సీపీకి మండలి చైర్మన్ దక్కేలా నేతలు ఓ అంగీకారానికి వచ్చారు.

శివసేనకు సీఎంతో పాటు 14 మంది పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం , 14మంత్రి పదువులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనికి మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు. సీఎం పీఠాన్ని ఎన్సీపీ, శివసేన చెరి రెండున్నరేళ్లు పంచుకుంటాయని ప్రచారం జరిగినా చివరికి శివసేనకు ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. 

keywords  : Shiv Sena, NCP, Congress , government ,Maharastra 

Tags:    

Similar News