వైద్యులను వదలని కోరనా : ఢిల్లీలో ఏడుగురు వైద్యులకు కరోనా పాజిటివ్

లాక్ డౌన్ విధించినప్పటికీ దేశంలో కరోనా భాదితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

Update: 2020-04-02 17:11 GMT
Representational Image

లాక్ డౌన్ విధించినప్పటికీ దేశంలో కరోనా భాదితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశంలో భాధితుల సంఖ్య 2000 కి దగ్గరలో ఉండగా, 53 మంది మృతి చెందారు. ఇక తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా భాదితులకి చికిత్సను అందిస్తున్న వైద్యులను కూడా కరోనా వదలడం లేదు..

తాజాగా ఏడుగురు వైద్యులకి కోవిడ్-19 సోకింది. తాజాగా, న్యూఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కొన్ని చోట్ల వైద్యులపై దాడులు చోటుచేసుకోవడం బాధాకరంగా చెప్పవచ్చు.. ఇక హైదరాబాద్‌లోనూ ఇద్దరు డాక్టర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దోమలగూడకు చెందిన వీరిద్దరూ దంపతులు..


Tags:    

Similar News