ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ

Update: 2019-01-04 01:45 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేత ఆమ్ ఆద్మీపార్టీ న్యాయ సలహాదారుడు, సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ ఫూల్కా ఆమ్ ఆద్మీపార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పంపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆయన విసుగుచెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే తనను రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనను అడిగారని, కానీ తాను రాజీనామా సమర్పించానని లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజీనామా చేసిన ఫూల్కా ఆప్‌ను వదిలిపెట్టడానికి, కారణాలను, నా తదుపరి ప్రణాళికలను వివరించేందుకు న్యూఢిల్లీలోని రైజినా రోడ్‌లో ఉన్న ప్రెస్‌ క్లబ్‌లో రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడతాను' అని ఫూల్కా చెప్పారు.

Similar News