ఢిల్లీలో ఇవాళ రెండోరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

* సా.4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం

Update: 2023-01-17 03:29 GMT

ఢిల్లీలో ఇవాళ రెండోరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP: ఇవాళ రెండవ రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక, సామాజిక అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇవాళ జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధ్యక్షులు తమ రాష్ట్రాల నివేదికలను సమర్పించనున్నారు. తొలిరోజైన నిన్న కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధ్యక్షులు తమ రాష్ట్రాల నివేదికలను సమర్పించారు.

Tags:    

Similar News