నదిలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో స్థానికులు !

Update: 2020-02-03 12:11 GMT
నదిలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో స్థానికులు !

అస్సాంలోని డిబ్రూగర్ జిల్లా సమీపంలోని ఓ గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఆయిల్ పైప్ లైన్ పేలుడంతో నదిలో మంటలు చెరేగాయి. భారీగా మంటలు, పొగాలు అలుముకున్నాయి. నది అంతర్భాగంలోని పైప్‌లైన్‌ పేలిపోవడంతో ఉపరితలంపై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు నదీ తీరంలో లీకవటంతో ఆయిల్ నదిలోకి వచ్చింది.

ఇది గమనించిన కొందరు నదీ తీరంలో నిప్పు అంటించి ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల కిందటే మంటలు ఎగిసిపడుతున్న విషయం గురించి అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. అయినా, మంటలను అదుపుచేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్రమంగా నదిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News