కరోనా కట్టడికి రూ.500 కోట్ల విరాళం ప్రకటించిన రిలయన్స్

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వస్తున్నాయి.

Update: 2020-03-30 17:43 GMT
Mukesh Ambani (File Photo)

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించగా, పలువురు కేంద్రమంత్రులు తమ ఒక నెల జీతం విరాళలంగా ప్రకటిస్తున్నారు. ఇక భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నెల వేత‌నాన్ని విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు.

తాజాగా ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రూ 500 కోట్ల విరాళం ప్రకటించింది. కోవిడ్‌-19పై పోరాటానికి మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలకు రూ.5కోట్ల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇక దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం వలన 1071 కేసులు నమోదు కాగా, 25 మంది మృతి చెందారు.


Tags:    

Similar News