Realme Watch 2: రియల్ మీ 2 స్మార్ట్ వాచ్ రిలీజ్... ఫీచర్లు ఇవే..!

Realme Watch 2: త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది

Update: 2021-05-04 11:31 GMT

రియల్మీ వాచ్ 2

Realme Watch 2: రియల్‌మీ వాచ్ 2 ని మలేషియాలో లాంచ్ చేసింది రియల్ మీ. అయితే త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 12 రోజుల బ్యాటరీ లైఫ్, 90 స్పోర్ట్స్ మోడ్‌లను ఈ వాచ్ కలిగిఉంది.

ధర..

రియల్ మీ వాచ్ 2 ధరను 229 రింగెట్లుగా(సుమారు రూ.4,100) నిర్ణయించారు. కేవలం నలుపు రంగులో మాత్రమే ఇది లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు...

రియల్‌మీ వాచ్ 2 స్క్వేర్ డయల్‌ను కలిగి ఉంది. 1.4-అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉంది. దీని పిక్సెల్ రిజల్యూషన్ 320x320గా ఉంది. 315 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 12 రోజుల రన్ టైమ్‌ను అందిస్తుంది. ఇందులో 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

వాచ్‌లో బాస్కెట్‌బాల్, బాక్సింగ్, డ్యాన్స్, హైకింగ్, గోల్ఫ్, ఇండోర్ సైక్లింగ్, అవుట్డోర్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, యోగా వంటి 90 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇతర రియల్‌మీ AIoT పరికరాలను ఈ వాచ్ తో ఉపయోగించవచ్చు. వాచ్‌కు ఐపీ 68 రేటింగ్ ఉన్నప్పటికీ ఈత కొట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వాచ్‌ను ఉపయోగించలేరని కంపెనీ పేర్కొంది.

ఇందులో బ్లూటూత్ వీ5, ఆండ్రాయిడ్ (ఆండ్రాయిడ్ 5.0, అంతకంటే ఎక్కువ), ఐవోఎస్(ఐవోఎస్ 11, అంతకంటే ఎక్కువ) ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేస్తుంది. ఎస్‌పీఓ2, హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్ల ఉన్నాయి. హార్ట్ రేటు ఎక్కువగా ఉంటే ఈ వాచ్ నోటిఫికేషన్లను అందిస్తుంది. హైడ్రేషన్ రిమైండర్, కదలకుండా ఉంటే రిమైండర్ చేయడం, కెమెరా కంట్రోల్, మెడియేషన్ అసిస్టెంట్ వంటి అదనపు ఫీచర్లతో ఈ వాచ్ అలరించనుంది.

Tags:    

Similar News