వాతావరణం: ఉపరితల ఆవర్తనంతో దేశంలో పలు చోట్ల వర్షాలు!

Update: 2020-06-16 03:00 GMT

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

ఇది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

దీనికి తోడు బంగాళాఖాతంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, మధ్య భారతం మీదుగా తూర్పు, పడమరగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదవుతున్నాయి.

వెంకటగిరిలో సోమవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.   

ఇక నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియు ద్వీపం అంతా విస్తరించాయి.

గుజరాత్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, బిహార్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.

మరో రెండు రోజుల్లో తూర్పు మధ్యప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.  

Tags:    

Similar News