రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు

Update: 2019-12-24 11:29 GMT
రాహుల్, ప్రియాంక

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత వారం జరిగిన నిరసనల్లో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు యూపీలోని మీరుట్ వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. మీరుట్ సమీపంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయంటూ పోలీసులు వారి కారును మీరుట్ సమీపంలో అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో రాహుల్ కాన్వాయ్ ఢిల్లీకి తిరుగుముఖం పట్టింది.



Tags:    

Similar News