నేను క్షమాపణలు చెప్పను.. వీడియో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ !

Update: 2019-12-13 09:46 GMT

రేప్‌ ఇన్‌ ఇండియా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని లోక్‌సభలో బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ తాను క్షమాపణలు చెప్పనని ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోడీ గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన క్లిప్ తన ఫోనులో ఉందని ఆ క్లిప్‌ను ట్వీట్ చేస్తానన్న రాహుల్‌ ప్రతి ఒక్కరు చూడొచ్చన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్‌లో చెలరేగుతోన్న ఆందోళనల నుంచి అందరి దృష్టిని పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పారు.



Tags:    

Similar News