నీటిలో పడిపోయిన బాలుడు..బాలుడిని కాపాడిని రెస్క్యూ సిబ్బంది

Update: 2019-09-26 10:36 GMT

పూనేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణేలోని అనేక ప్రాంతాల్లో ఏకథాటిగా కురిసిన వానలకు నగరమంతా అస్తవ్యస్థంగా మారింది. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో కొట్టుకుపోతే, మరికొన్ని చోట్ల ప్రజలు నీటిలో కొట్టుకుపోయారు. ఇలా ప్రమాదవశాత్తూ ఓ 7 నెలల బాలుడు వరద నీటిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది బాలుడిని ప్రాణాలతో కాపాడారు.

పూణేలోని మిత్ర మండల్‌ చౌక్‌‌లో‌ దంపతులు నివశిస్తున్నారు. వారి 7 నెలల బాబు నీటిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న పూణే మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు ఫైర్‌ బ్రిగేడ్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. ఓ టబ్బులో బాలుడిని చాకచక్యంగా కాపాడి తాళ్ల సహాయంతో పైకి లాగారు. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. బుజ్జాయి క్షేమంగా బయటపడడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు.

Tags:    

Similar News