పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ప్రధాని మోడీ స్పందన

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెల్లుబుకుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

Update: 2019-12-22 16:32 GMT
Modi (File Photo)

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెల్లుబుకుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇవాళ ఆందోళన చేస్తున్నవారిలో అత్యధికులు చొరబాటుదారులేనని ఆరోపించారు. చొరబాటుదారులు తమ గుర్తింపు చూపించరని, శరణార్ధులు తమ గుర్తింపును దాచిపెట్టరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలోనే ఎన్నార్సీ వచ్చిందని, యాజమాన్య హక్కులు కల్పించేందుకే పౌరసత్వ చట్టం తెచ్చామని మోడీ స్పష్టం చేశారు.

ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాంలీలా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల విషయమై మోడీ ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. విపక్షాలకు పలు ప్రశ్నలు సంధించారు.ఢిల్లీలో ఆందోళనలు సృష్టించేందుకు కొందరు నకిలీ వీడియోలు ప్రోత్సహిస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లును తీసుకొచ్చిన పార్లమెంట్ కు ధన్యవాదాలు తెలిపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

పౌరసత్వం బిల్లుపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి పక్షాలకు మోడీ పలు ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో అనేక అనధికారిక కాలనీలను మతాలను చూడకుండా రెగ్యులరైజ్ చేశామని గుర్తుచేశారు. కనీసం మెదడు ఉంటె చట్టం గురించి సరిగ్గా తెలుసుకోండని సవాలు విసిరారు. అబద్దాలు ప్రచారం చేసేవాళ్లను నమ్మకండని ప్రజలకు సూచించారు.తనకు వ్యతిరేకంగా ఎన్ని ర్యాలీలైన చేసుకోండని, పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని మోడీ ప్రతిపక్షాలకు సూచించారు. వాళ్ళ జీవనోపాధిపై దెబ్బ కొట్టవద్దని మోడీ పేర్కొన్నారు.     

Tags:    

Similar News