తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర!

Update: 2019-08-01 05:24 GMT

తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన తలాక్ బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఆమోదం తరువాత బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేసినట్టు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ప్రస్తుతం తలాక్ చట్టం ఆర్డినెన్స్ రూపంలో ఉంది. దీని స్థానంలో పూర్తిస్థాయిలో చట్టం వచ్చింది.

తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లో తీర్పు ఇచ్చింది. వెంటనే కేంద్రం దీనిపై బిల్లు రూపొందించి అదే సంవత్సరం డిసెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. అయితే, లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ గడప దాటలేక పోయింది దాంతో ఈ సమావేశాల్లో మరోసారి ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. జూలై 25న లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. అదేనెల ౩౦న రాజ్యసభ ఆమోదం పొందింది.



Tags:    

Similar News