ఎన్డీయేతర పార్టీల సమావేశం వాయిదా

Update: 2019-01-23 01:20 GMT

ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాల ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయి చేతుల మీదుగా హైకోర్టు ప్రారంభం కానుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఏపీకి చెందిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులైన లావు నాగేశ్వరరావు, రమణలను ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ఇదిలావుంటే.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. త్వరలో అమరావతిలో తలపెట్టిన ధర్మపోరాట సభకు రాహుల్ తోపాటు బీజేపీ యేతర పార్టీలను ఆహ్వానించినట్లు చంద్రబాబు తెలిపారు.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని.. స్థానిక పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఇక ఇవాళ జరగాల్సిన ఎన్డీయేతర పార్టీల సమావేశం వాయిదా పడింది. ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ సమావేశానికి అందుబాటులో లేకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో సమావేశంపై స్పష్టత రానుంది.

Similar News