నేడు భూటాన్‌లో ప్రధాని మోదీ పర్యటన..

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పాటు భూటన్‌లో పర్యటించున్నారు. ఇవాళ, రేపు పర్యటించున్న ఆయన రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

Update: 2019-08-17 03:28 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పాటు భూటన్‌లో పర్యటించున్నారు. ఇవాళ, రేపు పర్యటించున్న ఆయన రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మరో ఐదు కొత్త ప్రతిపాదనలపై కీలక చర్చలు జరుపనున్నట్లు సమాచారం. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన బూటాన్‌ వెళ్లడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్‌ శాశ్వత సభ్యదేశంగా చేసే ప్రతిపాదనకు భూటాన్‌ పూర్తి మద్ధతు ప్రకటించింది. నేటి ఉదయం 11.30కి పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. కాగా, మధ్యాహ్నం 2.40కి తాషీచ్చోడ్జోంగ్ ప్యాలెస్‌కి వెళ్తారు. అక్కడ జరిగే చ్చిప్‌డ్రెల్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.10కి భూటాన్ రాజును, ప్రజలను మోదీ కలుస్తారు. సాయంత్రం 4.10కి భూటాన్ ప్రధాని డాక్టర్ లొతాయ్ షేరింగ్‌తో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. భూటాన్ పార్లమెంట్ గ్యాల్యోంగ్ షోఖాంగ్‌లో ఈ సమావేశం జరగనుంది.

Tags:    

Similar News