PM Modi: మొబైల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: మూడు రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్‌

Update: 2023-10-27 08:35 GMT

PM Modi: మొబైల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: దేశంలో హై స్పీడ్‌ మొబైల్‌ సేవలపై ప్రధాని మోడీ అభినందనలు వ్యక్తం చేశారు. 5 జీ టెక్నాలజీతోపాటు భారత దేశ సాంకేతిక విజయాలను మోడీ కొనియాడారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్‌ మండపంలో మూడు రోజుల పాటు జరిగే ఫ్లాగ్‌షిప్‌ టెక్నాలజీ ఈవెంట్‌ ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ను మోడీ ప్రారంభించారు. ఇకపై ఒక దశాబ్దం.. ఒక శతాబ్దం అంటే ఎంతో దూరంలో ఉండదు.. ఎందుకంటే మనం సాధించిన సాంకేతిక విజయంతో భవిష్యత్తు.. వర్తమానం ఇక్కడే ఉన్నాయన్నారు. ఎగ్జిబిషన్‌లో మోడీ వంద 5జీ ల్యాబ్‌లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఇంజినీరింగ్‌ కాలేజీలు మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్నాయి.

Tags:    

Similar News