మళ్ళీ పెరిగిన పెట్రోలు,డీజిల్‌ ధరలు.. ఎంతో తెలుసా..?

Update: 2019-02-21 03:22 GMT

మూడు నెలల కిందట వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు.. కొన్ని రోజులు తగ్గడం ప్రారంభించాయి.. తాజాగా మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. పెట్రోలుపై లీటరు 15పైసలు, డీజిల్‌ పై 16పైసలు చొప్పున ధర పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పెరగడంతో ఇంధన ధరలు మళ్ళీ పెరిగాయి. సోమ, మంగళవారాల్లో దేశీయంగా పెట్రోలు ధరలు పెరిగినా, బుధవారం స్థిరంగా ఉన్నాయి. కానీ బుధవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ పుంజుకున్నాయి. తాజా పెరుగుదలతో దేశంలో వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ ‌: లీటరు పెట్రోలు ధర రూ. 75.50, డీజిల్‌ ధర రూ.71.12

అమరావతి : లీటరు పెట్రోలు ధర రూ. 75.28, డీజిల్‌ ధర రూ.71.49

ఢిల్లీ : లీటరు పెట్రోలు ధర రూ. 71.15, డీజిల్‌ ధర రూ.66.33

ముంబై: లీటరు పెట్రోలు ధర రూ. 76.79 డీజిల్‌ ధర రూ.69.47

చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 73.87, డీజిల్‌ ధర రూ.70. 09

కోలకతా : లీటరు పెట్రోలు ధర రూ. 73.25, డీజిల్‌ ధర రూ.68.12 

Similar News