వర్షంలోనూ పవార్ జోరుగా ప్రచారం

ఎన్నికల ప్రచారానికి నేటీతో తెరపడనుండటంతో రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2019-10-19 06:51 GMT

మహారాష్ట్రలో ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల ప్రచారం పతకస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారానికి నేటీతో తెరపడనుండటంతో రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వర్షంలోను ఆయన ప్రచారంలో నిమగ్నమైయ్యారు. పవార్ ర్యాలీ చేస్తుండగా ఓ వైపు ఉరుముల కూడిన భారీ వర్షం కురిసింది. పవార్ ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం కొనసాగించారు. 

పవార్ వర్షంలో తడుస్తూ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో ఓటర్లకు క్షమాపణ చెబుతూ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందిని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. పవార్ ప్రచారాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా.. మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికలు ఈ నెల 21 జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ నెల 24 తేదీనా తుది ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags:    

Similar News