PM Modi: మా ప్రాధాన్యం ఓటు బ్యాంకు కాదు.. అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నాం

PM Modi: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే రెట్టింపు సంక్షేమం ఉంటుంది

Update: 2023-01-19 14:02 GMT

PM Modi: మా ప్రాధాన్యం ఓటు బ్యాంకు కాదు.. అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తున్నాం

PM Modi: తమ ప్రభుత్వం ఓటు ఓటు బ్యాంకుకు ప్రాధాన్యం ఇవ్వలేదని కేవలం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే రెట్టింపు సంక్షేమం ఉంటుందన్నారు. వచ్చే 25ఏళ్లు ప్రతి పౌరుడికి, దేశానికి అమృత కాలమని ఈ సమయంలోనే అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించుకోవాలన్నారు. దేశంలో ప్రస్తుతం 11కోట్ల ఇళ్లకు కుళాయి ద్వారా నీళ్లు అందుతున్నాయని చెప్పారు. పొలాల్లో మంచి పంటలు, పరిశ్రమలను విస్తరించినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News