చంకలో బిడ్డను ఎత్తుకుని విధుల్లో మహిళా కనిస్టేబుల్.. వైరల్

పిల్లల ఆలన పాలనలో తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదు. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ పిల్లలకు ఎక్కడ లభించదు.

Update: 2020-03-03 10:22 GMT
Constable Priti Rani with her infant son in hers arms at Yogi Adityanath's event in Noida (Photo: PTI)

పిల్లల ఆలన పాలనలో తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదు. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ పిల్లలకు ఎక్కడ లభించదు. అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. బిడ్డకు ఏం అవసంరం వస్తుందో అమ్మ మనసుకే తెలుసు. పసితనంలో మనకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అమ్మకే తెలుసు. ఓ తల్లి తన ఉద్యోగంతో పాటు తన కొడుకు సంరక్షణ కూడా ముఖ‌్యమనే అంటోంది. ఓ మహిళా పోలీస్ భూజాన తన పిల్లాడిని వేసుకుని విధులకు హాజరయ్యారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌లో చెందిన ప్రీతి రాణి అనే మహిళా పోలీసు కానిస్టేబుల్‌ నోయిడాలోని దాద్రి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రీతి రాణికు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. సోమవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నోయిడాలో పాల్గొన్న ఓ కార్యక్రమానికి ప్రీతి రాణి సెక్యూరిటీగా డ్యూటీ వేశారు. ఆమె ఉదయ 6 గంటలకే విధులకు ‍‍‍‍హజరుకావాలి.

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ ప్రీతి రాణి భార్త వేరే పని పడటంతో మరో మార్గం లేకపోయింది. దీంతో కొడుకును వెంట తీసుకుని డ్యూటీకి హజరయ్యారు. చంటి పిల్లవాడితో కానిస్టేబుల్‌ ప్రీతి రాణి సభకు రావడంతో అక్కడి ప్రజలందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఈ దృశ్యాలు కాస్తా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మహిళ పోలీసు కానిస్టేబుల్‌ ప్రీతి రాణి స్పందిస్తూ.. ''బాబు వాళ్ల నాన్నకు పరీక్ష ఉంది. ఆయన పిల్లావాడిని పరీక్ష హాలుకు తీసుకెళ్లలేడు. ఏమి చేయలేని స్థితిలో పిల్లాడిని వెంట పెట్టుకొని విధులకు రావాల్సి వచ్చింది. ఉద్యోగంతోపాటు నా కొడుకు సంరక్షణ నాకు ముఖ్యం. అందుకే నేను తనను నాబిడ్డను ఇక్కడకు తీసుకు రావాల్సి వచ్చింది'' అన్నారు. కాగా..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆదివారం, సోమవారం పర్యటన సందర్భంగా.. గౌతమ్‌ బుద్ద నగర్‌, గ్రేటర్‌ నోయిడాకు విచ్చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు. 

 



 


Tags:    

Similar News