పది పాస్ అయ్యారా.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఉద్యోగాలు మీకోసమే!

కేవలం పదో తరగతిలో తెచ్చుకున్న మార్కుల ఆధారంగా ఉద్యోగాల్ని పొందే అవకాశం వచ్చింది. పోస్టల్ సర్వీసెస్ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.

Update: 2019-10-17 09:45 GMT

మీరు పది పాస్ అయ్యారా ..! అయితే ఈ వార్త మీకోసమే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది... పదవ తరగతి చదివిన వారికి ప్రభుత్వ కొలువు చేసేందుకు ప్రభుత్వం ఈ అద్భుత అవకాశాన్ని కల్పించింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3,600 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అందులో తెలంగాణలో 970 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 2,707 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

ఈ ఉద్యోగాల కోసం  ఎలాంటి పరీక్షా రాయాల్సిన అవసరం లేదు.. కేవలం పదవ తరగతిలో మీరు సాధించుకున్న మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగం ఇస్తారు. కాకపోతే ఈ ఉద్యోగాలకి సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానం కచ్చితంగా ఉండి తీరాలి. త్వరలోనే బ్రాంచి పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. www.appost.inలో నవంబర్ 14లోపు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అప్లై చేసుకునే వారు మాత్రం మొదటి ప్రయత్నంలోనే పదవ తరగతి పాస్ అయి ఉండాలి..  

Tags:    

Similar News