అయ్యో! ఆ వందలో మన నగరం ఒక్కటీ లేదు!

ప్రపంచంలో నివాస యోగ్య నగరాలు మొదటి వందలో మన దేశానికి చెందిన ఒక్క నగరమూ లేదట. ఈ విషయాన్ని ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించింది.

Update: 2019-09-04 15:26 GMT

ప్రపంచంలో నివాస యోగ్య నగరాలు మొదటి వందలో మన దేశానికి చెందిన ఒక్క నగరమూ లేదట. ఈ విషయాన్ని ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకటించింది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం నివాస యోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేస్తుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన 140 నగరాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఆయా నగరాల్లో జీవనప్రమాణాల స్థాయి, నేరాల నమోదు, ప్రయాణ సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక స్థిరత్వం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని సర్వ్ నిర్వహిస్తుంది. ఈ ప్రాతిపదికన ఆయా నగరాలకు నెంబరింగ్ ఇస్తుంది.

ఈ ఏడాది టాప్ నివాస యోగ్యమైన నగరంగా ఆస్ట్రియా దేశపు రాజధాని వియన్నా నిలిచింది. వియన్నా ఇలా మొదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. సిడ్నీ, ఒసాకా నగరాలు రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే, ఏడు సంవత్సరాల పాటు వరుసగా మొదటి స్థానంలో నిలిచినా మెల్బోర్న్ నగరాన్ని గత సంవత్సరం వియన్నా వెనక్కి నెట్టింది. ఇక ఈ జాబితాలోని తోలి 20 నగరాల్లో ఎనిమిది యూరప్ లోనే ఉండడడం చెప్పుకోదగ్గ అంశం. అయితే ఈసారి పారిస్ తన స్థానాన్ని బాగా దిగాజార్చుకుని 25 వ స్థానంలో నిలిచింది. ఇక లండన్, న్యూయార్క్ నగరాలు 48, 58 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక సిరియా రాజధాని డమాస్కస్ ఈ లిస్టులో చిట్టచివరి స్థానాన్ని పొందింది. అదేవిధంగా పాకిస్తాన్ నగరాలు ధాకా, కరాచీ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.

మన దేశంలో ఆ స్థాయి నగరాలు లేవు..

నివాస్య యోగ్యమైన నగరాల్లో మన నగరం ఒక్కటి కూడా తొలి 100 స్థానాల్లో లేవు. పైగా గతేడాది 112 వ స్థానంలో ఉన్న దిల్లీ 118 వ స్థానానికి, 117 వ స్థానంలో ఉన్న ముంబయి 119 వ స్థానానికి పడిపోయాయి.


Tags:    

Similar News