వరదల కారణంగా 900మందికి డెంగ్యూ..

వరదల కారణంగా 900మందికిపైగా డెంగ్యూ సోకినట్లు తెలుస్తుంది. ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క పాట్నాలోనే 900మందికి వ్యాధి సోకినట్లు తేలింది.

Update: 2019-10-15 06:11 GMT

బీహార్‌లో వచ్చిన భారీ వరదలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదల కారణంగా అక్కడ 900మందికిపైగా డెంగ్యూ సోకినట్లు తెలుస్తుంది. ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్క పాట్నాలోనే 900మందికి వ్యాధి సోకినట్లు తేలింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. వరద నీరు తరలిపోకుండా నగరంలో నిలిచిపోయిందన్న దానిపై వివరణ ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ ఆదేశించారు. న‌లుగురు స‌భ్యులతో కూడిన క‌మిటీని ఏర్పాటు చేశారు. అలాగే పట్టణాల్లో ఎప్పటికప్పడు డ్రైనేజీల‌ను శుభ్రపరచాలని ఆదేశించారు.

సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన వరదల కారణంగా బీహార్ రాష‌్ట్రంలో 73 మంది మరణించారు. చాలా మంది డెంగ్యూ ప్రబలి మరణించారు.దీనిపై అక్కడ కేసులు కూడా నమోదైయ్యాయి. అయితే అధికార యంత్రాంగం సరైనా సమయంలో స్పంధించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యాక్తం చేసింది. 12మంది అధికారులను విధుల నుంచి తొలిగించింది. 12 మంది ఇంజినీర్ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరో 22మంది ఉద్యోగులకు జీతాలు నిలిపివేసింది. 

Tags:    

Similar News