కోర్టులో కన్నీరు పెట్టుకున్న నిర్భయ తల్లి
నిర్భయ కేసు రోజుకో టర్న్ తీసుకుంటుంది. నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు
నిర్భయ కేసు రోజుకో టర్న్ తీసుకుంటుంది. నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దోషుల హక్కుల కోసం న్యాయస్థానాలు శిక్ష అమలును ఆపితే.. తమ హక్కుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. కేసులో జరుగుతున్న జాప్యంపై ఆమె కోర్టు హాల్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు.
ఈ కేసులో నిర్భయ దోషి పవన్ గుప్తా తన తరఫున వాదిస్తున్న లాయర్‌ను తొలగించిన కారణంగా మరింత గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. కొత్త లాయర్‌ను నియమించే వరకు విచారణ వాయిదా వేయాలని నిర్భయ దోషి పవన్ గుప్తా కోరాడు. లాయర్‌ను తామే ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా.. నిర్భయ కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాకు ఒకేసారి శిక్ష విధించాలని, అయితే ఢిల్లీ కోర్టు నిందితులకు చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 5న పేర్కొంది ఏడు రోజుల గడువు నిందితులకు ఇస్తున్నట్లు పేర్కొంది. బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది.
అయితే కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి భావోద్వేగానికి లోనైయ్యారు. దోషుల ఉరిశిక్ష అమలుకు ఏడాదిన్నరగా అడుగుతూనే ఉన్నాను. ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి వారికి డెత్ వారెంట్లు జారీ చేయలేదు. ఇప్పుడు దోషులు లాయర్ లేకుండా కోర్టుకు హాజరయ్యారు. చేతులు కట్టుకుని న్యాయం కోసం ప్రార్థిస్తున్నాను. మరి నా హక్కులు ఏమై పోయినట్లు అని జడ్జి ముందు భావోద్వేగానికి గురైయ్యారు. దీంతో స్పందించిన జడ్జి ప్రతీ ఒక్కరు మీ హక్కుల గురించి ఆలోచిస్తున్నారని, అందుకే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా, న్యాయస్థానం ప్రాంగణంలో నిరసనకు దిగారు. దోషులను వెంటనే ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.