నిర్భయ కేసులో కీలక పరిణామం

నిర్భయ దోషి వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను బుధవారం పిటిషన్‌ దాఖలు చేశాడు.

Update: 2020-01-29 14:47 GMT

ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకరైన అక్షయ్ ఠాకూర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరపనుంది. న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యలతో కూడిన ధర్మాసనం ఈ క్యురరేటివ్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. అయితే ఉరి శిక్ష నుంచి బయపడేందుకు నిందితులు విశ్వాప్రయత్నాలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తన విధించిన ఉరిశిక్షణను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదిలా ఉంటే నిర్భయ దోషి వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను బుధవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది. రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 2012లో నిర్భయపై నిందితులు ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు.

మరోవైపు ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన సవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్. బానుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, రాష్ట్రపతి.. క్షమాబిక్ష అభ్యర్థనను త్వరితగతిన తేల్చడం అంటే మనస్సును అన్వయించుకోవడం కాదని పేర్కొంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రకటించిన తీర్పులతో సహా అన్ని సంబంధిత విషయాలను రాష్ట్రపతి ముందు ఉంచినట్లు ధర్మాసనం తెలిపింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించిన అధికారిక నోట్ ఉన్న ఫైళ్ళను పరిశీలించామని.. క్షమాబిక్ష పిటిషన్ను కొట్టివేసే ముందు అన్ని సంబంధిత రికార్డులు పరిగణించబతాయని కోర్టు తేల్చింది. కాగా ముఖేష్ పిటిషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలు చేశాడు. డెత్ వారెంట్ అమలును నిలిపివేయాలని అతను పిటిషన్ లో కోరాడు. వాస్తవానికి ఫిబ్రవరి 1 న అతని మరణశిక్ష విధించాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News