ముకేశ్‌పై లైంగిక దాడి జరిగింది..ముకేశ్‌ లాయర్ సంచలన వ్యాఖ్యలు

నిర్భయ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైనా ముఖేష్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.

Update: 2020-01-28 10:58 GMT
Nirbhaya rape and murder case convict Mukesh Singh

నిర్భయ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైనా ముఖేష్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. తనపై తీహార్‌ జైల్లో లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. సర్వోన్నత న్యాయస్థానంలో ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. తీహార్‌ జైల్లో సహ దోషి అక్షయ్‌ సింగ్‌ తపపై పలుమార్లు ఆరోపణలు లైగింక దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. జైలు అధికారులు సహకరించారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించారు. దీనిపై నిందిదుడు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముఖేష్‌ సింగ్‌ పిటిషన్ పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థాయం ప్రధాన జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చెపట్టింది.

విచారణలో ముఖేష్‌ సింగ్‌ తీహార్‌ జైల్లో అధికారులపై పలు ఆరోపణలు చేశాడు. అక్షయ్‌ సింగ్‌ అనే దోషి తనపై పలుమార్లు అత్యాచారానికి చేశాడని న్యాయస్థానంలో వెల్లడించాడు. రాష్ట్రపతికి రామ్‌నాథ్‌ కోవింద్‌‌కు క్షమాభిక్ష పిటిషన్‌లో తెలిపానని పట్టించుకోలేదని వాపోయాడు. ముఖేష్‌ సింగ్‌ లాయర్ అంజనా ప్రకాశ్‌ వాదనలు వినిపించారు.

ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. దీనిపై తుది తీర్పును బుధవారం వెల్లడించనుంది. నిందితులు పలుమార్ల కోర్టును ఆశ్రయించడంపై నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరిశిక్ష తప్పించుకోవడానికే నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది. రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు.

2012లో నిర్భయపై నిందితులు ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు.

 

Tags:    

Similar News