కేంద్ర ప్రభుత్వంపై సినీనటి ఘాటు వ్యాఖ్యలు

Update: 2020-01-23 15:02 GMT
Nanditha das

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, డైరెక్టర్ నందితా దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేకమైన చట్టాన్ని స్వాగతించేది లేదని స్పష్టం చేశారు. జైపూర్‌లో నిర్వహించిన లిటరేచర్ ఫెస్టివల్ లో నందితా దాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆమె.. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా విద్యార్థులు , సామాన్య ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీల రద్దుపై జరుగుతున్న పా విద్యార్థులు, సామాన్య ప్రజలు నడిపిస్తున్నారని, యువత చేస్తున్న పోరాటం అభినందనీయం అన్నారు.

షాహీన్ బాగ్‌లో నాలుగు తరాలుగా నివాసం ఉంటున్న వారిని భారతీయులుగా నిరూపించుకోవాలిని మోదీ ప్రభుత్వం కోరాడం సరికాదన్నారు. పౌరులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేయాలని నందితా పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి మూలకు షాహీన్ బాగ్ పోరాటం చేరుకోవాలని, మిగతా ప్రాంతాలు మాదిరిగా షాహీన్ బాగ్ అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీల రద్దుపై జరుగుతున్న ఉద్యమాలు విద్యార్థులు, సామాన్య ప్రజలు నడిపిస్తున్నారని, యువత చేస్తున్న పోరాటం అభినందనీయం అన్నారు. దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని నందితా దాస్ జోస్యం చెప్పారు. దేశ ఆర్థిక సంక్షోభంపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్యతో దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని అన్నారు. సీని పెద్దలు దీనిపై స్పందిచాలని నందితా దాస్ కోరారు.

ఃదేశంలో ఏట్టి పరిస్థితుల్లో సీసీఏ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరసనకారులు ఆందోళనలు పట్టించుకోమని వారి ఆందోళనలు కొనసాగించుకోమని కేంద్ర మంత్రి తేల్చిచెప్పిం సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News