కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కొనసాగేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. ట్వీట్టర్లో రాజీనామా లేఖను రాహుల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను పార్టీ అధ్యక్ష పదవిలో లేనని స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడి నియామకంపై పార్టీ సత్వరమే స్పందించాలని కోరారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తక్షణమే సమావేశమై నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగాలని పార్టీ క్షేత్ర స్ధాయి నేతల నుంచి, పార్టీ సీఎంల వరకూ రాహుల్పై ఒత్తిడి తీసుకువచ్చినా రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పార్టీ నేతలు రాజీనామాలు సమర్పించినా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నూతన చీఫ్ ఎంపిక ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, రాహుల్ రాజీనామాతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ నేత మోతీలాల్ వోరాను నియమించారు. పార్టీ చీఫ్ బాధ్యతలు మోతీలాల్ వోరాకు అప్పగించారు. చత్తీస్గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న 90 సంవత్సరాల వోరా నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.