పాకిస్తాన్‌ చెరలో ఉన్న ప్రశాంత్‌పై స్పందించిన కేంద్రం

Update: 2019-11-21 11:44 GMT
రవీష్ కుమార్

పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. 2016-17లో అనుకోకుండా పొరపాటున పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడని, ప్రశాంత్ ఇష్యూపై పాక్‌తో మాట్లాడుతున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అక్రమంగా పాకిస్తాన్‌లో ఉంటున్నాడని అభియోగం నమోదైందన్న రవీష్ కుమార్‌ అతనికి కాన్సులర్ యాక్సిస్ ఇవ్వాలని, అలాగే సురక్షితంగా అప్పగించాలని పాకిస్తాన్‌ను కోరామన్నారు. ప్రశాంత్ ను భద్రంగా అప్పగించే బాధ్యత పాకిస్తాన్‌దే అన్నారు. అయితే, ప్రశాంత్ భారత్ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు.

Tags:    

Similar News