అప్పుడు చెల్లలు - ఇప్పుడు అన్న

Update: 2019-10-24 14:55 GMT

పేకాటే పేకాటే .. తమ్ముడు తమ్ముడు అన్న సూత్రం రాజకీయాలకి సరిగ్గా వర్తిస్తుంది. బరిలో నిలిచేది కుటుంబ సభ్యులు అయినప్పటికి ప్రత్యర్ధులుగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకి ,ఉపఎన్నికల గాను ఈరోజు ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా మహారాష్టలోని పర్లీ అనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్న చెల్లల్లు మధ్య ఆసక్తికరమైన పోరు నడిచింది. కానీ చివరగా విజయం మాత్రం అన్ననే  వరించింది. బీజేపీ సీనియర్ నేత, గోపీనాథ్ ముండే మరణం అనంతరం ఆయన కూతురు పంకజ ముండే రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఆమె మంచి నేతగా గుర్తింపు పొందారు.

ఇక 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పర్లీ అనే నియోజకవర్గం నుండి ఆమె బరిలోకి దిగారు. ఆమెకి పోటిగా గోపీనాథ్ ముండే సోదరుడి కుమారుడు ధనంజయ్ ముండే బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. సవాల్ కూడా విసురుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం 30,524 ఓట్ల తేడాతో ధనంజయ్ గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. కానీ అప్పుడు పంకజ ముండే 25వేల మెజారిటీతో అన్నపై విజయం సాధించారు. 

Tags:    

Similar News