మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా

Update: 2020-03-20 07:18 GMT
Kamal Nath

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్‌నాథ్‌ సర్కార్‌కు మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ 15 నెలల కాలంలో సమర్థవంతమైన పాలన అందించానన్న కమల్‌నాథ్‌ తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని తమ ఎమ్మెల్యేలను బీజేపీ కర్ణాటకలో బంధించిందని విమర్శించారు. ఐదేళ్ల పాటు పరిపాలన చేయాలని ప్రజలకు తమకు అధికారం కట్టబెట్టారని, కానీ తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రచేసిందన్నారు.

Full View


Tags:    

Similar News