Republic Day: కాంగ్రెస్‌ నేతలు బాహాబాహీ..వైరల్ వీడియో

గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తన్నుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Update: 2020-01-26 14:58 GMT
కాంగ్రెస్‌

గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నేతలు తన్నుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఈ ఘటన జరిగింది. గాంధీ భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో దేవేంద్ర సింగ్‌ యాదవ్‌, చందు కుంజిర్‌ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఆకస్మాత్తుగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చుట్టుపక్కల ఉన్నవారికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. జాతీయ జెండా ఆవిష్కరణకు ముందు ఈ ఘటన జరగడంపై అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరు విస్తుపోయారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ అక్కడికి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు ఇద్దరు గొడవపడంపై సీఎం కమల్ నాథ్ దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లారు. దీంతో సీఎం వారిని పిలిచి మందలించారు. ఆ నాయకులు ఎందుకు గొడవపడ్డారో తెలియాల్సి ఉంది. వారి ఇరువురి విభేదాలు ఉన్నట్లు కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

చందు కుంజిర్, దేవేంద్ర సింగ్‌లు దాడి చేసుకునే ముందు విషయంలో గొడవ పడినట్లుగా కొందరు చెబుతున్నారు. వారు కొట్టుకుంటున్న దృశ్యాలు ఓ ప్రముఖ వార్త సంస్థ ట్విటర్ లో పెట్టింది. కాంగ్రెస్ నేతలు కొట్టుకుండుంగా పోలీసులు జోక్యం చేసుకోని వారిని శాంతిపజేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేయి చేసుకోవడంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News