Jyotiraditya Scindia: బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా

కాంగ్రెస్‌ను పార్టీ వీడిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు.

Update: 2020-03-11 09:35 GMT
Jyotiraditya joins in BJP

కాంగ్రెస్‌ను పార్టీ వీడిన సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కషాయ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఈ రోజు(బుధవారం) 12.30 గంటలకే బీజేపీలో చేరుతారని వార్తలొచ్చినా.. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కీలక నేతలతో కొద్దీసేపు చర్చించిన అనంతరం ఆయన ఆ పార్టీలో చేరారు. జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీ ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. సింధియా 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీలకి రాజీనామా అనంతరం తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరలేచిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో మంగళవారం ఉదయం సింధియా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సింధియా బీజేపీలో బుధవారం చేరతారని సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, మద్దతుదారులు నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా నేపథ్యంలో మోదీ, అమిత్‌ షా ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సింధియా గది వద్ద ఆయన చెందిన పలు బోర్డులను తొలగించారు.

అయితే సింధియాను బహిష్కరిస్తూ.. ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ సర్కార్‌కు సింధియా రాజీనామా చేయడంతో ఆయనకు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడి కమల్ నాథ్ సర్కార్‌ తీవ్ర సంక్షోభంలో పడింది. 


Tags:    

Similar News