సీబీఐ అదనపు డైరెక్టర్‌ పదవి నుంచి ఎం.నాగేశ్వరరావు బదిలీ

Update: 2019-07-06 01:24 GMT

సీబీఐ అదనపు డైరెక్టర్‌ పదవి నుంచి నాగేశ్వరరావును.. ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భార్య పేరుతో రుణాలు, షెల్‌ కంపెనీలతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ నాగేశ్వరరావును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. కాగా నాగేశ్వరరావు తెలుగు వ్యక్తి .. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామం. నాగేశ్వరరావు 1986 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌కు చెందిన అధికారి... 

Full View

Tags:    

Similar News