జమ్మూకశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేయడంపై దాయాది పాకిస్థాన్‎ కాకుండా దేశంలోని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Update: 2019-10-13 12:42 GMT

జమ్మూ కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేయడంపై దాయాది పాకిస్థాన్‎ కాకుండా దేశంలోని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో జమ్మూకశ్మీర్ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఆర్టికల్ 370 మళ్లి పునరుద్ధరిస్తామని విపక్షాలు తమ ఎన్నికల మేనిఫేస్టోలో పెడతామని చెప్పగలవా అని ప్రశ్నించారు.

అయితే జమ్మూకశ్మీర్ భారత్ భూభాగాలేనని, అవి దేశానికి కిరీటం లాంటివని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై విపక్షాలు తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రపంచం మొత్తం కశ్మీర్ విషయంలో భారత్‌ను సమర్ధిస్తున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో దేవేందర్ ఫడ్నవీస్ ను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిలకలు జరగనున్నాయి. ఈనెల 24న ఫలితాలు వెలువడనున్నాయి . 

Tags:    

Similar News