కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

Update: 2019-07-28 08:38 GMT

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్.. తాజా నిర్ణయంతో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినట్టైంది. వీరిలో ముగ్గురు జేడీఎస్, 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. యడియూరప్ప బలపరీక్షకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకోవడంతో కన్నడ నాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మరీ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేగాక సీఎం యడియూరప్ప బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 224 మంది. అయితే 17 మందిపై వేటు పడటంతో ఈ సంఖ్య 207కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105 కాగా.. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు.. స్వతంత్రులు ఇద్దరు కలిపి ఆ పార్టీ బలం 107కి చేరింది.

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది. ప్రస్తుతానికి యడియూరప్ప సర్కార్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.స్పీకర్ నిర్ణయాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు విశ్లేషకులు. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాక బీజేపీకి వారు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉండటంతో వారిపై అనర్హత వేసినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News