సీబీఐ వాదనలకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కపిల్ సిబల్

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. చిదంబరాన్ని కనీసం 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

Update: 2019-08-22 11:33 GMT

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరాన్ని సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. చిదంబరాన్ని కనీసం 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించింది సీబీఐ. చిదంబరం అన్నీ తెలిసే తప్పు చేశారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. చిదంబరం, కేసు విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. చిదంబరం తరపున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌ సీబీఐ వాదనలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. FIPB బోర్డులో ఆరుగురు సెక్రటరీలుంటారని ఆ ఆరుగురు విదేశీ పెట్టుబడులకు అనుమతిలిచ్చారని సిబల్‌ గుర్తుచేశారు. అనుమతులిచ్చిన ఆ ఆరుగురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సిబల్‌ కోర్టుకు తెలిపారు. చిదంబరం అరెస్ట్‌ వెనుక దురుద్దేశ్యాలున్నాయని సిబల్ అన్నారు.

మరోవైపు చిదంబరం అరెస్ట్‌పై సీబీఐ, కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఎండగట్టింది. చిదంబరం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయనను టార్గెట్‌ చేశారని ఆరోపించింది. చిదంబరంపై నమోదైన ఆరోపణలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని దర్యాప్తు సంస్థ అధికారులను సవాల్‌ చేసింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను లక్ష్యంగా చేసుకున్న సీబీఐ అధికారులు కార్తీ చిదంబరంపై నాలుగు సార్లు దాడులు చేయడంతో పాటు 20 సార్లకు పైగా సమన్లు జారీ చేసి వేధించారని మండిపడింది.

Tags:    

Similar News