కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు. బీహార్లోని సుపౌల్ జిల్లాలోని బహిరంగ సభ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ రాళ్లదాడి జరిగింది. సహార్సా ప్రాంతంలో సీఏఏకి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నయ్య వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌లోని వాహనాశ్రేణిపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో కన్నయ్యకు గాయాలైనట్లు తెలుస్తోంది.
గత శనివారం సరన్ జిల్లాలో కన్నయ్య కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఆ ఘటనలో కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా., సీపీఐ పార్టీ తరఫున 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్నయ్య కుమార్ పోటీ చేశారు. బీహార్‌లోని బెగూసరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీజేపీ వ్యతిరేకంగా నిరసలు తెలిపి కన్నయ్య కుమార్ ఫేమస్ అయ్యారు. ఇక ప్రస్తుతం సీఏఏ, ఏన్నార్సీ, ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. కన్నయ్య కుమార్ పై పలువురు నేతలు ఖండిస్తున్నారు. దుండగులకు అరెస్టు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Bihar: Former JNU Students Union leader Kanhaiya Kumar injured after stones were pelted at his convoy in Supaul, today. Kanhaiya was heading towards Saharsa, after addressing a rally in Supaul at the time of incident. More details awaited. pic.twitter.com/IzJhtWzxiB
— ANI (@ANI) February 5, 2020